Marri Chenna Reddy : మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు

Marri Chenna Reddy : మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వర్థంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఇందిరాపార్క్‌లోని రాక్‌ గార్డెన్‌లో ఉన్న ఆయన సమాధివద్ద..తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, హర్యానా గవర్నర్ బండార దత్తాత్రేయ, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ నివాళులర్పించారు. మర్రి చెన్నారెడ్డి గొప్ప పరిపాలన దక్షుడు, రాజనీతిజ్ఞుడు, పరిపాలన దక్షుడు, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. రాజకీయాలకతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినప్పుడే చెన్నారెడ్డికి అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు.

Tags

Next Story