Huzurabad By poll : పదకొండో రౌండ్‌లో టీఆర్ఎస్ మళ్లీ ఆధిక్యంలోకి..!

Huzurabad By poll : హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హవా కొనసాగిస్తున్నారు. పదో రౌండ్‌లోనూ ఈటల ఆధిక్యంలో దూసుకెళ్లారు. పదో రౌండ్ ముగిసే సరికి బీజేపీ 5 వేల 631 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే పదకొండో రౌండ్‌లో టీఆర్ఎస్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. అయితే పదకొండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 5, 264 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 48 వేల 588 ఓట్లు సాధించగా.. టీఆర్ఎస్ 43 వేల 324 ఓట్లు సాధించింది.
ఉదయం పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ అధిక్యం కనబర్చగా.. ఆ తర్వాత ప్రతి రౌండ్‌లోనూ ఈటల రాజేందర్ ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లారు. వరుసగా ఏడు రౌండ్లలో బీజేపీ పూర్తి ఆధిక్యంతో సత్తా చాటింది. అయితే తర్వాత ఎనిమిదో రౌండ్‌లో మాత్రం టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యంలోకి వచ్చింది. తర్వాత తొమ్మిదో రౌండ్‌లో భారీ మెజార్టీ సాధించిన ఈటల.. పదో రౌండ్‌లోనూ ఆధిక్యంలో దూసుకెళ్లారు. పదకొండో రౌండ్‌లో మాత్రం మరోసారి టీఆర్ఎస్ 367 ఓట్ల ఆధిక్యం సాధించింది.
ఇక హుజురాబాద్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం హమ్మత్‌నగర్‌లో బీజేపీ అధిక్యం సాధించింది. అలాగే దళితబంధు పైలట్ ప్రాజెక్టు గ్రామం శాలపల్లి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు సొంతూరు సింగాపూర్‌లోనూ ఈటలకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com