TRS Plenary: టీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం.. హెచ్ఐసీసీలో మహాసభ..

TRS Plenary: టీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈనెల 27న మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు జరపాలని పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. 27న ఉదయం 10 గంటల వరకు హెచ్ఐసీసీకి చేరుకోవాలని పార్టీ ప్రతినిధులందరికీ సీఎం సూచించారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపారు.
మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సైతం హాజరు కానున్నారు. 27వ తేదీన ఉదయం 11 గంటలకు పార్టీ పతాకాన్ని అధినే కేసీఆర్ ఆవిష్కరించి సభా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సుమారు 11 తీర్మానాలను ఆమోదించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ఫ్లీనరీ స్థలాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని టీఆర్ఎస్ శ్రేణులు పండుగలా జరుపుకుంటారన్నారు. 21 ఏళ్లు పూర్తయినందున హెచ్ఐసీసీలో ప్రతినిధుల మహాసభను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నామని, 21వ ఆవిర్భావ దినోత్సవానికి 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఏర్పాట్లపై ఇవాళ జీహెచ్‌ఎంసీ అధికారులతోనూ సమావేశం కానున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com