Munugodu: మునుగోడులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. తరలిరానున్న పార్టీ నేతలు..

Munugodu: మునుగోడు ఉపఎన్నికపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బైపోల్ బరిలో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న టీఆర్ఎస్.. ఈనెల 20న మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు పెద్ద ఎత్తన జనసమీకరణపై దృష్టి సారించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇంఛార్జులను నియమించారు. జన సమీకరణ బాధ్యతను ఇంఛార్జులకు అప్పగించారు.
మునుగోడుకు మంత్రి జగదీష్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిలను నియమించగా.. చౌటుప్పల్ మున్సిపాలిటీకి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌లను బాధ్యతలు అప్పగించారు. చౌటుప్పల్ రూరల్‌కు హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, మర్రిగూడకు భువనగిరి ఎమ్మెల్యే పైల్ల శేఖర్‌రెడ్డి, నాంపల్లికి దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, చండూరు మున్సిపాలిటీకి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, చండూరు రూరల్‌కు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భరత్, యాదాద్రి జడ్పీ ఛైర్మన్‌రెడ్డి, నారాయణపురంకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతలను సభకు ఇంఛార్జులను నియమించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com