Prashant Kishor: టీఆర్ఎస్ నేతల్లో పీకే టెన్షన్.. తన టీమ్ జాడ తెలియక సతమతం..

Prashant Kishor: టీఆర్ఎస్ నేతల్లో పీకే టెన్షన్.. తన టీమ్ జాడ తెలియక సతమతం..
Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం గడిచిన నెల రోజులుగా టీఆర్ఎస్ లీడర్ల సర్వే లు చేస్తుంది.

Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం గడిచిన నెల రోజులుగా టీఆర్ఎస్ లీడర్ల సర్వే లు చేస్తుంది. ఇప్పటికే 30 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, టిఆర్ఎస్ గ్రాఫ్ , ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి గులాబీ బాస్ కు ఐప్యాక్ సంస్థ రిపోర్టులు అందాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల పనితీరు వారి పై వస్తున్న వివాదానికి పొలిటికల్ యాక్టివిటీస్ , వ్యక్తిగత వ్యాపారాలు , గ్రూప్ తగాదాలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత , లీడర్ లో ఎఫెక్ట్ పార్టీపై ఏ మేరకు ఉంది .. ఇలా అనేక అంశాలను తీసుకుని సర్వే నివేదికలు తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది.

దీంతో గులాబీ లీడర్ లో గుబులు మొదలైంది. ఇప్పుడు ఐప్యాక్ చేస్తున్న సర్వేలను ఆధారంగానే తమ భవిష్యత్తు ఉంటుందని టీఆర్ఎస్ లీడర్లు కొంతమంది ఫిక్స్ అవుతున్నారట. వారిపై ఇచ్చే రిపోర్టుతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేది.. లేనిది ముడిపడి ఉంటుందని పలువురు నేతలు భావిస్తున్నారట. అందుకే పీకే సంస్థ సభ్యులు ఎక్కడ ఉంటారు ?... తమ నియోజకవర్గంలో ఎవరైనా కొత్త వాళ్ళు సర్వేల పేరుతో సమాచారాన్ని సేకరిస్తున్నారా? గ్రామాల్లో ఎవరెవరు తిరుగుతున్నారు?ప్రజలను కొత్త వారు ఎవరైనా కలుస్తున్నారా?... ఒకవేళ సర్వేలు చేస్తూ ఉంటే ఎలాంటి సమాచారాన్ని అడుగుతున్నారు? ఇలా ఆరా తీస్తున్నారట పలువురు లీడర్లు .

అయితే ఐప్యాక్ సంస్థకు సంబంధించిన సభ్యుల సమాచారం లీడర్లకు అంతుచిక్కడం లేదట. అందుకే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తమ అనుచరులతో సొంతంగా నిఘా ఏర్పాటు చేసుకున్నారట. ఒకవేళ సర్వే అంటూ ఎవరైనా వ్యక్తులు వస్తే.. వాళ్లకు ఎలాంటి సమాచారం ఇవ్వాలి.. సర్వే చేసే వాళ్ళు ఏ ప్రశ్నలు వేసినా ఎమ్మెల్యే పనితీరు బాగా ఉందని చెప్పే విధంగా లీడర్ల నిఘా టీం పనిలో పడింది. వివాదాస్పదమైన అంశాలు బయటికి రాకుండా బయట వ్యక్తులకు సమాచారం దొరకకుండా జాగ్రత్త పడుతున్నారట.

ఐ ప్యాక్ టీం గోప్యంగా సమాచారం సేకరిస్తుడటంతో గత నెల రోజులుగా కొంత మంది లీడర్లు నియోజకవర్గంలో పొలిటికల్ యాక్టివిటీ పెంచారట. సర్వే టీం ఎక్కడెక్కడ తిరుగుతున్నారో తెలియదు కాబట్టి .. నిత్యం ప్రజల్లోనే ఉంటూ బిజీ బిజీగా గడుపుతున్నారట కొందరు నేతలు. ఇప్పటికే తెలంగాణ పల్లెలను సర్వే సంస్థలు జల్లెడ పడుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేకుండా సమస్యలే ప్రధాన ఎజెండాగా చేపడుతున్నాయి. నియోజకవర్గానికి 30 వేల సమస్యలను సేకరించడమే లక్ష్యంగా ఈ సర్వేలు కొనసాగుతున్నాయి.

గ్రామంలో చిన్న సమస్యనూ వదిలిపెట్టడం లేదు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, గ్రామపంచాయతీ కార్యాలయం, వైకుంఠధామం తదితరాలను పరిశీలించి.. వాటి పనితీరును రికార్డు చేస్తున్నాయి. సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, స్వయం సహాయక బృందాలు, కులసంఘాల నుంచి వివరాలను సేకరిస్తున్నాయి. అయితే తమపై సర్వే చేసే పీకే టీం ఎవరో.. మిగతా సర్వే సంస్థల సభ్యులు ఎవరో తెలియక సతమతమవుతున్నారు లీడర్లు.

Tags

Read MoreRead Less
Next Story