Huzurabad By Election 2021: 27వ తారీఖు.. 25 ఎకరాలు.. లక్షలాది ప్రజలు.. ఆ సభలో..!

Huzurabad By Election 2021: హుజురాబాద్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచేది మనమేనంటూ ఇప్పటికే గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను కొట్టే శక్తి ఎవరికీ లేదన్న సీఎం కేసీఆర్... ఎన్నికల ముగింపు సభలో ప్రచారం చేస్తామని చెప్పారు. దీంతో... ముగింపు సభ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు టీఆర్‌ఎస్ నేతలు.
హుజురాబాద్ శివారులో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పెంచికలపేట వద్ద సభా స్థలాన్ని పరిశీలించారు మంత్రి హరీష్‌రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌బాబు. ఈ నెల 27న సీఎం కేసీఆర్ సభ ఉంటుందంటున్నారు టీఆర్‌ఎస్ వర్గాలు. 25 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. హుజురాబాద్ సరిహద్దులో.. సభకు టీఆర్‌ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ సభకు లక్షలాదిమందిని తరలించేందుకు ఇప్పటినుంచే... కసరత్తులు చేస్తున్నారు గులాబీ నేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com