Munugodu: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ స్ట్రాటజీ అదేనా..?

Munugodu: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ స్ట్రాటజీ అదేనా..?
Munugodu: మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది .

Munugodu: మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది . ఉప ఎన్నికలో ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు పోవాలనే దానిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ అనేక సమీక్షలు జరిపారు. మునుగోడులో గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. అయితే హుజూరాబాద్లో చేసిన భారీ ప్రణాళికలు టీఆర్ఎస్‌కు వర్కౌట్ కాలేదు.

హుజురాబాద్ ఉపఎన్నికకు ముందు దళిత బంధు లాంటి మెగా స్కీమ్స్ తీసుకొచ్చారు. హుజురాబాద్‌ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి వేలకోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక నియోజకవర్గం అభివృద్ధి పేరుతోనూ భారీగానే ఖర్చు పెట్టారు. అయినా టీఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కాబట్టి మునుగోడు ఉప ఎన్నికల్లో హడావుడి లేకుండా గెలిచేలా వ్యూహాలు రచిస్తున్నారు గులాబీ బాస్.

మునుగోడు నియోజకవర్గంలో అక్కడి గ్రామాల ప్రజల కోరిక మేరకు నూతనంగా గట్టుప్పల మండలం ఏర్పాటు కూడా చేసింది. గ్రామాల వారీగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక పంద్రాగస్టు రోజు సీఎం కేసీఆర్ కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ముందే చెప్పారు. దీంతో మునుగోడు మండలంలో కొత్త పింఛన్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీ వేగవంతం చేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. దీంతోపాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేసి లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

నోటిఫికేషన్ విడుదలై ఎన్నికల ప్రచారం మొదలయ్యే నాటికి పరిస్థితలంతా మారుతాయనే ప్రచారం జరుగుతోంది. గత ఉపఎన్నికల్లో మాదిరిగానే మునుగోడులోనూ టిఆర్ఎస్ భారీ ప్రణాళికల ప్రకటిస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. దీంతో సీఎం కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉప ఎన్నిక వస్తేనే మునుగోడు అభివృద్ధి జరుగుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పుడు ఉపఎన్నిక క్రమంలోనే అభివృద్ధి హామీలు ఇస్తే రాజగోపాల్ రెడ్డి చెప్పిన మాట నిజమవుతుంది. కాబట్టి మునుగోడులో కేసీఆర్ రివర్స్ స్ట్రాటజీతో వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు చర్చిస్తున్నాయి.

2014లో గెలుపొందిన టీఆర్ఎస్ తమ హయాంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేసింది. 2018 లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచిన తర్వాత నియోజకవర్గం ఎంత నిర్లక్ష్యానికి గురైందనేది ప్రజల ముందు ఉంచాలని చూస్తుంది గులాబీ దళం. కోమటిరెడ్డి నిర్లక్ష్యంతో నిలిచిపోయిన అభివృద్ధి అంతా రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయనున్నారు టిఆర్ఎస్ శ్రేణులు. మొత్తానికి హుజురాబాద్ తర్వాత జరుగుతున్న ఉపఎన్నిక మునుగోడు కావడంతో అంతా ఆసక్తికరంగా మారింది

Tags

Read MoreRead Less
Next Story