Bandi sanjay : ఉద్రిక్తతకు దారితీసిన బండి సంజయ్ పర్యటన..!

Bandi sanjay : నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.. మిర్యాలగూడ టౌన్ దాటిన వెంటనే మిల్లుల వద్ద నల్లజెండాలతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.. బీజేపీ వాహన శ్రేణిపై రాళ్లతో దాడి చేశారు.. కార్లపై దాడులు చేయడంతో టీఆర్‌ఎస్ శ్రేణులను లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు పోలీసులు.. బండి సంజయ్ కాన్వాయ్‌ని అతి కష్టం మీద తప్పించి అక్కడ్నుంచి పంపించేశారు..
నల్లగొండ జిల్లాద మిర్యాలగూడ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ధాన్యం కొనుగోలు పరిశీలించడానికి సంజయ్.. శెట్టిపాలెం కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లారు. ఈనేపథ్యంలో సంజయ్‌కు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ నేతలు.. సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీఆర్‌ఎస్ నేతలు.. బీజేపీ నేతలపై రాళ్లదాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com