నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్.. !

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. అనుమల మండలంలో భగత్‌కుమార్ తరపున మంత్రులు తలసాని, మహమూద్ అలీ ప్రచారం నిర్వహించారు. సాగర్‌కు జానారెడ్డి ఏం చేశారని ఓట్లు వేయాలో చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ హయాంలో సాగర్ అభివృద్ధి చెందిందని.. జానారెడ్డి సొంతూరికి కూడా ఏం చేయలేకపోయారని తలసాని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి నిరోధక పార్టీ అని విమర్శించారు.
సాగర్ ఎన్నికల్లో ముస్లిం సోదరులు.. టీఆర్ఎస్‌కు మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్. ముస్లింల కోసం సీఎం కేసీఆర్.. షాదీ ముబాకర్ తీసుకొచ్చారని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల్లో భగత్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.మరోవైపు భగత్ గెలుపు కోసం ఆయన కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొంటున్నారు.. భగత్ తల్లి లక్ష్మీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తన కుమారుడిని గెలిపించాలని ఆమె కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఆమె ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు..
ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల స్క్రూటినీ పూర్తయింది. 17 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నివేదిత రెడ్డితోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి, మరో 15 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో సాగర్ బరిలో 60 మంది అభ్యర్థులు మిగిలారు. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.. ఈలోపు ఏవైనా ఉపసంహరణలు జరిగితే.. ఫైనల్‌గా బరిలో నిలిచే అభ్యర్థులు ఎందరో తేలనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com