టీఆర్ఎస్‌లో టికెట్ల లొల్లి.. టికెట్ ఇవ్వకపోవడంపై సెల్ టవర్ ఎక్కిన పార్టీ నేత..!

వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు టీఆర్ఎస్‌లో టికెట్ల లొల్లి రాజుకుంది. ఎన్నికల్లో తమకుకు టికెట్ ఇవ్వకపోవడంపై మనస్తాపానికి గురైన టీఆర్ఎస్ నేత, మహిళా నాయకురాలు వేర్వేరుచోట్ల ఆత్మహత్యాయత్న చేసుకుంటామని బెదిరించారు. హన్మకొండ అదాలత్ జంక్షన్ వద్ద టీఆర్ఎస్ నాయకురాలు శోభారాణి.. ఐదు అంతస్తుల భవనం ఎక్కి పెట్రోల్ పోసుకునేందుకు యత్నించగా.. మరో టీఆర్ఎస్ నేత సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి టీఆర్ఎస్ నేత ఫోన్‌లో సర్దిజెప్పడంతో వారు కిందికి దిగారు. 58వ డివిజన్.. జనరల్ మహిళకు కేటాయించినా స్థానిక టీఆర్ఎస్ నేతలు తనకు టికెట్ ఇవ్వడం లేదని శోభారాణి ఆరోపించారు. ఉద్యమకారులు, పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని బయటివ్యక్తులకు టికెట్లు కేటాయిస్తున్నారని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com