క్లైమాక్స్‌కు చేరిన ఈటెల ఎపిసోడ్.. బహిష్కరించేందుకు రంగం సిద్ధం..!

ఈటల ఎపిసోడ్‌ను క్లైమాక్స్‌కు చేర్చే ప్రయత్నం కనిపిస్తోంది. ఇప్పటికే ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించిన కేసీఆర్.. ఇప్పుడు పార్టీ నుంచి కూడా బహిష్కరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వంపైనా, ప్రభుత్వ పథకాలపైనా ఈటల కామెంట్స్ చేయడంతో.. ఇక ఉపేక్షించేది లేదనుకుంటున్నారు కేసీఆర్. మంత్రులను రంగంలోకి దించడం దీనికి ఓ సంకేతం అని చెప్పుకుంటున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన.. అందులోనూ కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేశారు. ఈటలను పార్టీ నుంచి పంపించేయడానికి ఇదొక సంకేతమని చెప్పుకుంటున్నారు.
చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు.. ఈటల రాజేందర్ వచ్చారని తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రులు. బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటలనే అని విమర్శించారు. బీసీల నుంచి మరో నేత ఎదగకుండా అడ్డుకున్నారని ఈటలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసైన్డ్ భూములు కొనకూడదని తెలిసీ కొన్నారని.. తాను చేసిన తప్పుల గురించి మాట్లాడకుండా.. కేసీఆర్ గురించి, ప్రభుత్వ పథకాల గురించి విమర్శించడం తగదని విరుచుకుపడ్డారు.
అటు ఈటల రాజేందర్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. హుజూరాబాద్‌కు భారీ కాన్వాయ్‌తో వెళ్లిన ఈటల.. అనుచరులు, మద్దతుదారులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడా ఆలస్యం చేయకుండా.. తెలంగాణ ఎన్‌ఆఐలతోనూ జూమ్‌లో కాన్ఫరెన్స్ పెట్టారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సాధించుకున్నామని.. ఇప్పుడు ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమం మొదలైందని అన్నారు.
హుజూరాబాద్ కార్యకర్తలతో చర్చింది తన రాజీనామా, పార్టీ సభ్యత్వానికి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అవసరమైతే ఆత్మగౌరవ నినాదంతో కొత్త పార్టీ పెట్టినా ఆశ్చర్యం లేదని సన్నిహితులు చెబుతున్నారు. అయితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..బైఎలక్షన్స్‌లో గెలిచి... ఆ తరువాత పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా కొందరు చెబుతున్నారు. మొత్తానికి ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా పరిస్థితి మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com