TRS 'Vijaya Garjana': వరంగల్‌లో ఈ నెల 29న టీఆర్‌ఎస్ విజయగర్జన

TRS 'Vijaya Garjana': వరంగల్‌లో ఈ నెల 29న జరగనున్న టీఆర్‌ఎస్ విజయగర్జన సభ ఏర్పాట్లను మంత్రి దయాకర్‌రావు పరిశీలించారు. టీఆర్‌ఎస్ 20 ఏళ్ల ఉత్సవాలను ఈ నెల 29న నిర్వహిస్తామన్నామన్నారు. సభ కోసం రైతులు స్వయంగా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు. 300 ఎకరాల్లో సభ జరుగుతుందన్నారు.
పార్కింగ్ కోసం దాదాపు 1500 ఎకరాలను గుర్తించినట్లు తెలిపారు. రేపు వరంగల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని, వరంగల్ అభివృద్ధిని సీఎం కేసీఆర్ వివరిస్తాన్నారు. కేంద్రం తెచ్చిన సాగుచట్టాలను టీఆర్‌ఎస్ వ్యతిరేకించడంతోనే.. బీజేపీతో వైరం ఏర్పడిందన్నారు. సాగుచట్టాలను కేంద్రం విరమించుకునే వరకు పోరాటం చేస్తామన్నారు.
కేంద్రం ధాన్యం కొలుగోలు చేయాలని, పెట్రోధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు మంత్రి దయాకర్‌రావు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com