MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా.. హాట్ టాపిక్‌గా క్రాస్ ఓటింగ్ ఇష్యూ..

KCR (tv5news.in)
MLC Elections: తెలంగాణలో జరిగిన ఆరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నింటా TRS గెలిచింది. TRS గెలిచినప్పటికీ.. క్రాస్ ఓటింగ్ హాట్ టాపిక్ గా మారింది. చాలాచోట్ల TRS ఓట్లు కూడా కాంగ్రెస్ కు పడ్డాయి. పకడ్బంధీగా క్యాంపు పాలిటిక్స్ నడిపినప్పటికీ.. ఈ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరగడం చర్చనీయాంశమైంది. క్రాస్ ఓటింగ్ పై TRS ఫైర్ అవుతుంటే.. కాంగ్రెస్ మాత్రం నైతిక విజయం మాదే అంటోంది.
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో TRS చావుతప్పి కన్నులొట్టపోయిందన్నారు CLP నేత భట్టి విక్రమార్క. TRSది అసలు గెలుపే కాదన్నారు. TRS వాళ్లు కూడా కాంగ్రెస్ కే జై కొట్టారన్నారు. 96 ఓట్లున్న తమ పార్టీకి 242 ఓట్లు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు భట్టి. సంఖ్యా పరంగా గెలిచామని TRS చెబుతున్నా నైతిక విజయం తమదే అన్నారు.
ఖమ్మంలో భారీగా క్రాస్‌ఓటింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు టీఆర్‌ఎస్ అభ్యర్థి తాతా మధు. కాంగ్రెస్‌కు పెద్ద సంఖ్యలో క్రాస్ ఓట్లు పడ్డాయని.. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డవారిపై చర్యలకు డిమాండ్ చేస్తానన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఓట్లు.. TRS కు పడ్డాయి. దీంతో TRS కు భారీ మెజారిటీతో గెలిచింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com