TS : హైదరాబాద్‌లో నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ

హైదరాబాద్‌లో నకిలీ ఐస్‌క్రీమ్ తయారీదారులు రెచ్చిపోతున్నారు. కల్తీ ఐస్‌క్రీమ్‌లు అమ్ముతూ చిన్నపిల్లల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. నిన్న చందానగర్.. నేడు దూలపల్లిలో ఎస్‌వోటీ పోలీసులు దాడి చేయడంతో కల్తీగాళ్ల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఇవాళ దూలపల్లిలో డైరీకూల్ ఐస్‌క్రీమ్స్ గోదాంపై పోలీసులు దాడులు చేసి.. నిర్వాహకుడు గొల్ల అంకయ్యను అరెస్ట్ చేశారు. కల్తీ ఐస్‌క్రీమ్‌లకు బ్రాండెడ్ స్టిక్కర్లు వేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన మెటీరియల్ ఉపయోగించి ఐస్‌క్రీమ్‌ల తయారీ చేయడంతో పోలీసులు షాకయ్యారు. గోదాం నుంచి భారీగా నకిలీ ఐస్‌క్రీమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో రెండ్రోజుల్లో 28 లక్షల విలువైన నకిలీ ఐస్‌క్రీమ్స్ సీజ్ చేసిన పోలీసులు.. నగరవ్యాప్తంగా తయారీ కేంద్రాలపై దాడులు కొనసాగిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com