TG EDCET : రేపు తెలంగాణ ఎడ్ సెట్

TG EDCET : రేపు తెలంగాణ ఎడ్ సెట్
X

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీ (ఆదివారం) న 2025-26 విద్యా సంవత్సరంలో బీఈడీ కోర్స్ ల్లో ప్రవేశాల కొరకు నిర్వహించు టీజీఈడిసెట్ - 2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కాకతీయ విశ్వవిద్యాలయ బౌతిక శాస్త్ర విభాగ ఆచార్యులు, టీజీ ఈడిసెట్ - 2025 కన్వీనర్ ఆచార్య బైరు వెంకట్రామరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. టీజీ ఈడిసెట్-2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కు మొత్తం 38,758 మంది అభ్యర్థులు నమోదు చేసుకునట్టు, వీరిలో పురుషులు 7218, మహిళలు 31,539, 1 ట్రాన్స్ జెండర్ ఉన్నట్లు, మొత్తం 74 పరీక్షా కేంద్రాలలో పరిక్షలలో, రెండు సెషన్ లలో, మొదటి సెషన్ ఉదయం 10.00 గంటల నుంచి 12.00 గంటల మధ్య, రెండవ సెషన్ మద్యాహ్నం 2.00 గంటల నుంచి 4.00 గంటల, ఉదయం సెషన్ అభ్యర్థులు 8.00 గంటల, మద్యాహ్నం సెషన్ అభ్యర్థులు 12.00 గంటలలోపు రిపోర్ట్ చేయాలనీ, ఉదయం 9.30, మద్యాహ్నం 1.30 అనంతరం అభ్యర్ధులను పరీక్షా కేంద్రం లోనికి అనుమతించటం జరుగుతుందన్నారు.

ఒక నిమిషం నిబంధన అమలులో ఉంటుంది అని, హాల్ టికెట్ తో పాటు, ఆధార్ కార్డు లేదా, పాన్ కార్డు లేదా, పాస్ పోర్ట్ లేదా, ఓటర్ ఐడెంటిటీ కార్డు లేదా, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు, బ్లూ లేదా బ్లాక్ పెన్ తమవెంట కలిగి ఉండాలని, అభ్యర్థుల హాల్ టికెట్ తో పాటు వెనుక వైపు పరీక్షా కేంద్ర లొకేషన్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని, అవసరమైతే ముందురోజే పరీక్షా కేంద్రాన్ని తెలుసుకోవాలి అని ప్రకటనలో తెలిపారు.

Tags

Next Story