TS: ఎన్నికల వేళ..IAS అధికారుల బదిలీలు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఒకేసారి 31 మంది అధికారులను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలో అయిన వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు.. నలుగురు జిల్లా కలెక్టర్లు ఉన్నారు. ఎంసీహెచ్‌ఆర్‌డీ డీజీగా శశాంక్ గోయల్, యువజన సర్వీసులు, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్, ఆయుష్ డైరెక్టర్‌గా హరిచందన, స్పోర్ట్స్ డైరెక్టర్‌గా కొర్ర లక్ష్మి, సెర్ప్ సీఈవోగా గౌతమ్, హస్తకళల అభివృద్ధి సంస్థ సీఎండీగా అలుగు వర్షిణి, గురుకులాల సొసైటీ కార్యదర్శిగా నవీన్ నికోలస్, అగ్రికల్చర్ డిప్యూటీ సెక్రటరీగా సత్యశారద, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా స్నేహ బదిలీ అయ్యారు.
నలుగురు జిల్లా కలెక్టర్లకు స్థానచలనం కలిగింది. హైదరాబాద్ కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి, ములుగు కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రియాంక, పెద్దపల్లి కలెక్టర్‌గా ముజమిల్‌ఖాన్ బదిలీ అయ్యారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా ప్రతిగ్ జైన్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా మంద మకరంద్ బదిలీ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com