Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత ట్విస్ట్

Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత ట్విస్ట్
X

ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ వాయిదా పడింది. కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడంతో జడ్జి కావేరి బవేజా అసహనం వ్యక్తం చేశారు.

వాదనలకు రాకపోతే పిటిషన్ ఉపసంహరించుకోవాలని జడ్జి కావేరి బవేజా పేర్కొన్నారు. బుధవారానికి కేసును వాయిదా వేస్తూ కోర్టు తుది విచారణ జరుపుతామని తెలిపింది. మంగళవారం కేసును ఎమ్మెల్సీ కవిత న్యాయవాదులు ఉపసంహరించుకున్నారు. సీబీఐ చార్జిషీట్లో తప్పులు ఉన్నాయని.. కవిత డిఫాల్ట్ బెయిల్ కు అర్హురాలని జులై 6న కవిత న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. చార్జీషీట్లో తప్పులేవీ లేవని సీబీఐ తెలిపింది.

ఇప్పటికే సీబీఐ చార్జిషీట్ ను జులై 22న కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేటీఆర్, హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు మూడు, నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ కవితను తీహార్ జైల్లో కలిశారు.

Tags

Next Story