TG : తెలంగాణలో రెండ్రోజులు వానలు

TG : తెలంగాణలో రెండ్రోజులు వానలు
X

తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అక్టోబర్ 31, నవంబర్ 1 శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే అవకాశాలున్నాయని వివరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాలు కురుస్తున్న సమయంలో చెట్ల కింది వెళ్లొద్దని కోరింది. హైదరాబాద్ లో కూడా చిరుజల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆకాశం మేఘావృతమై ఉండి జల్లులు కురిసే అవకాశం ఉండడంతో చలి తీవ్రత తగ్గుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత క్రమంగా చలి పెరుగుతుందని అంచనా వేసింది. లా నీనా కారణంగా ఈ సంవత్సరం చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అక్టోబర్, నవంబర్ మధ్య వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో లా నీనా ఏర్పడినట్లు పేర్కొంది. హైదరాబాద్ లో ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువ ఉంటుందని హెచ్చరించింది. పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రెండు మూడు రోజులు క్రితం వరకు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివార్లలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి. 16 నుంచి 17 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30-33 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ముఖ్యంగా తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కవగా కనిపిస్తుంది. తేలికపాటి వర్షాల కురిసే అవకాశం ఉండడంతో చలి తీవ్ర తగ్గతుంది. అయితే తర్వాత క్రమంగా చలి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Tags

Next Story