TRS Rajya Sabha: రాజ్యసభకు టీఆర్‌ఎస్ అభ్యర్ధుల నామినేషన్లు.. ఆపై కేసీఆర్‌తో భేటీ..

TRS Rajya Sabha: రాజ్యసభకు టీఆర్‌ఎస్ అభ్యర్ధులు దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని, గంగుల, మల్లారెడ్డితో కలిసి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన సందర్భంగా దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డికి నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర.. ప్రగతిభవన్ సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజసభ సభ్యకోసం నామినేషన్ వేసిన అనంతరం..తనకు అవకాశం కల్పించినందుకు కుటుంబసభ్యులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రవిచంద్రతోపాటు దామోదరరావు, పార్థసారథిరెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈకార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, మధు, ఎమ్మెల్యేలు కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com