Telangana: తెలంగాణలో లూలు గ్రూప్ భారీ పెట్టిబడి

Telangana: తెలంగాణలో లూలు గ్రూప్ భారీ పెట్టిబడి
యూఏఈ కేంద్రంగా రిటైలింగ్‌ వ్యాపార విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీ రానున్న అయిదేళ్లలో రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

తెలంగాణలో లూలు గ్రూపు భారీ పెట్టిబడి పెట్టనుంది. యూఏఈ కేంద్రంగా రిటైలింగ్‌ వ్యాపార విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీ రానున్న అయిదేళ్లలో రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో త్వరలో ఒక పెద్ద మాల్‌ను, హైపర్‌ మార్కెట్‌ను ప్రారంభించనుంది.శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో మరో లాజిస్టిక్స్‌ కేంద్రాన్నీ నిర్మించనుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో నిర్వహించిన కార్యక్రమంలో లులు గ్రూపు ఛైర్మన్‌ యూసుఫ్‌ అలీ వెల్లడించారు. ఇటీవల దావోస్‌ సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం, ఆ తర్వాత పలు దఫాలుగా జరిగిన సంప్రదింపుల ఫలితంగా ఈ పెట్టుబడి ప్రణాళిక ఖరారైనట్లు తెలిపారు.

మరోవైపు ఫ్రాన్స్‌కు చెందిన డిజిటల్‌ సేవల సంస్థ ‘టెలీ పెర్ఫార్మెన్స్‌’ హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని నెలకొల్పడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. తాము 3 వేల మందికి పైగా నిపుణులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. జులైలోనే తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. త్వరలోనే ఈ సంస్థ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story