CM Revanth Reddy : ఫ్యూచర్ సిటీలో భూగర్భ విద్యుత్ : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : ఫ్యూచర్ సిటీలో భూగర్భ విద్యుత్ : సీఎం రేవంత్ రెడ్డి
X

ఫ్యూచర్ సిటీలో భూగర్భ విద్యుత్ కు ఏర్పాట్లు చేయాలని, ప్రస్తుతం అక్కడున్న హైటెన్షన్ లైన్లను తొలగించాల ని సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారు లను ఆదేశించారు. ఇవాళ సీఎం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలన్నా రు. తొలుత సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ను తీసుకురావాలన్నారు. 60 కిలో మీటర్ల అవుటర్ రింగ్ రోడ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణా ళికలను సిద్ధం చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఫుట్ పాత్ లు, నాలా ల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశిం చారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్ లకు కావాల్సిన విద్యుత్ అవస రాలపైన హెచ్ఎండీఎ తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్ గా మార బోతుందని, డేటా సిటీగా మారబోతోందని, ఇందుకు అవసరమైన విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేష న్ల విద్యుత్ అవసరాల ను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. రైల్వే లైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవా ని అన్నారు. ఇలా రాబోయే మూడేండ్ల వరకు విద్యుత్ అవసరాలను అంచనా వేసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

Tags

Next Story