Hyderabad : హైదరాబాద్ లో నిరుద్యోగుల ఆందోళన: జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్..

జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద వందలాది మంది నిరుద్యోగులు ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. 'వి వాంట్ జస్టిస్' అంటూ ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ నిరసన కారణంగా దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ చుట్టూ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దరూ.
కాగా గత పది రోజులుగా నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఈ ఆందోళన చోటు చేసుకుంది. నిరసనకారులు అశోక్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ తమ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో నిరాహార దీక్ష చేస్తున్న అశోక్‌ను బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరామర్శించారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలని తాము కూడా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com