AP-Amaravathi : ఏపీ రాజధాని అమరావతి..

AP-Amaravathi : ఏపీ రాజధాని అమరావతి..
మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతేనని.. కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. దేశంలోని 39శాతం రాష్ట్రాల రాజధానులకు.... మాస్టర్ ప్లాన్ లేదన్నది.... నిజమా.. కాదా.... అని రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు... కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ లిఖితపూర్వక జవాబిచ్చారు. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానులకు.. మాస్టర్‌ ప్లాన్‌ ఉందని పేర్లతో సహా వెల్లడించిన ఆయన అమరావతికీ మాస్టర్‌ ప్లాన్ ఉందన్నారు. రాజధానుల బృహత్‌ ప్రణాళికలను ఆమోదించిన వాటిలో అమరావతి కూడా..... ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. ఏపీ రాజధాని అమరావతే అని వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు సోమ‌వారం కేంద్ర పట్టణాభివృద్ధి సహాయ మంత్రి కౌశల్‌కుమార్‌ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా నిర్ణయించారు. ల్యాండ్ పూలింగ్ (రైతుల దగ్గరి నుంచి భూములు సేకరించి) చేసి రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం జరిగింది. ప్రధాని మోదీ శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని మారుస్తున్నాం అంటూ బిల్లులు కూడా తీసుకొచ్చింది. ఒకటి కాదు మూడు రాజధానులు అని ప్రకటన చేసింది. రాజధాని మారుస్తూ బిల్లు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం ఆ తర్వాత ఉపసంహరించుకుంది. చట్ట పరంగా సాధ్యం కాదని తేలడంతో దొడ్డిదారి మార్గాలను ఎంచుకుంటోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్ష కోసం అంటూ అక్కడ ఐదు వందల కోట్లతో క్యాంప్ ఆఫీసు కట్టుకుని అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ కోర్టు కేసుల కారణంగా ఇది కాస్త ఆలస్యమవుతోంది. ఇటీవల జగన్ కూడా త్వరలో విశాఖ నుంచే పాలన చేపడతామని చెప్పారు. దసరాకు విశాఖకు వెళ్తామన్నారు. దసరా వెళ్లి రెండు నెలలు గడిచినా.. ఇంకా ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఈలోపు.. కేంద్రం కూడా అమరావతి రాజధాని అని చెప్పడంతో ఇప్పుడు వైసీపీ సర్కార్ రాజధాని విషయంలో సందిగ్ధంలో పడింది.

దీంతోపాటు దేశవ్యాప్తంగా 28 రాష్ర్టాల్లో కేవలం త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలకు మాత్రమే మాస్టర్‌ ప్లాన్‌లు లేవని కౌశ‌ల్ కుమార్ తెలిపారు. మిగతా అన్ని రాష్ట్రాలకు కూడా మాస్టర్‌ ప్లాన్‌లు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. వీటిని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందన్న మంత్రి కౌశల్‌కుమార్‌ అమరావతికి సైతం మాస్టర్‌ ప్లాన్‌ ఉందని, దీనిని కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఆయన తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story