కేసీఆర్ కుర్చీ కోసం ఏదైనా చేస్తారు- కిషన్‌రెడ్డి

తెలంగాణ సమాజాన్ని కల్వకుంట్ల కుటుంబం బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల్ని తమవిగా చెప్పుకుంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. KCR కుటుంబం కుర్చీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుందని అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
అంతకముందు జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా సర్యాపేటకు వచ్చిన ఆయన.. మహావీరచక్ర కల్నల్ సంతోష్‌బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత చింతలచెరువులో జాతీయ ఉత్తమ పారిశుధ్య కార్మికురాలు పురస్కారం పొందిన మారతమ్మ ఇంట్లో అల్పాహారం చేశారు. కరోనా కాలంలో ఒక్కరోజు కూడా విరామం లేకుండా ప్రజారోగ్యం కోసం పనిచేసిన ఆమె సేవల్ని ప్రశంసించారు.
కరోనా కష్టకాలంలో పేదలందరినీ ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందనన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. కరోనా వారియర్లకు 50 లక్షల ఇన్స్యూరెన్స్ అందిస్తున్నామన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందిస్తామని భరోసా ఇచ్చారు. త్వరలోనే చిన్నారులకు కూడా టీకాలు ఇస్తామన్నారు. సూర్యాపేట జిల్లాలో రెండో రోజు కిషన్‌రెడ్డి పర్యటన కొనసాగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com