TG : మూసీ పరివాహంలో కిషన్ రెడ్డి టూర్

మూసీ పరివాహక ప్రాంతాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పర్యటించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో ఇండ్లు, దుకాణాలు కోల్పోయి నిర్వాసితులుగా మారనున్న బాధిత ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. కిషన్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న 8 జిల్లాల పార్టీ అధ్యక్షులతో, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, హైడ్రా, ట్రిపుల్ ఆర్ పై నేతలతో కిషన్ రెడ్డి చర్చించారు. ప్రభుత్వం నిర్వాసితులను ఆదుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.
మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం సరికాదన్నారు కిషన్‌రెడ్డి. పేదలను ఒప్పించి మాత్రమే ఖాళీ చేయించాలని, బలవంతంగా వారిని తరలించడం సరికాదన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ముందుగా కమర్షియల్ నిర్మాణాలను మాత్రమే కూల్చాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం వల్ల వేలాది మంది పేదలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందన్నారు. మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, నిర్వాసితులకు అండగా కొత్త కార్యచరణ అమలు చేయబోతున్నామన్నారు కిషన్‌రెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com