Rahul Gandhi: ఐక్య కాంగ్రెస్ అన్‌స్టాపబుల్

తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పార్టీలో ఇప్పటికే కొనసాగుతున్న నాయకులు ముందొచ్చిన, వెనుక వచ్చిన వారనే తేడా ఉండకూడదని అంతా సమానమే అనే భావనతో వ్యవహరించాలని స్పష్టంచేశారు. ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇతర సీనియర్ నేతలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, తదితరలు ఈ సమావేశానికి హజరయ్యారు. "ఐక్య కాంగ్రెస్ అన్‌స్టాపబుల్" కర్ణాటకలో మాదిరే తెలంగాణలోనూ త్వరలో ప్రజాకేంద్రీకృత రాజకీయాల శకం రాబోతోందంటూ సమావేశం ముగిసిన అనంతరం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టులు పెట్టారు రాహుల్ . సమావేశం ముగిశాక ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని పొంగులేటి, జూపల్లి కలిశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com