TGSRTC : వావ్.. బస్సుల్లోనూ యూపీఐ స్కానర్లు.. చిల్లర టెన్షన్ పోయినట్టే!

TGSRTC : వావ్.. బస్సుల్లోనూ యూపీఐ స్కానర్లు.. చిల్లర టెన్షన్ పోయినట్టే!
X

ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ చెప్పేసింది తెలంగాణ ఆర్టీసీ. ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) గుడ్ న్యూస్ అందించింది. బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. తొలుత పైలెట్ ప్రాజక్ట్ కింద హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, బండ్లగూడ డిపోల్లో ఇది అమలు చేస్తామని, దశల వారీగా రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఈ విధానాన్ని ప్రవేశ పెడతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

10 వేల ఐ-టీమ్ మెషీన్లను తమ సిబ్బందికి ఆర్టీసీ అందించనుందని, దీని ద్వారా ప్రయాణికులు ఫోన్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బు చెల్లించి టికెట్ పొందవచ్చని తెలిపారు. దీ అర్టీసీ బస్సుల్లో అటు కండక్టర్లకు, ఇటు ప్రయాణికులకు 'చిల్లర' కష్టాలు తప్ప నున్నాయి. ఇప్పటికే కొన్ని రూట్లలో గరుడ, రాజధాని, సిటీ బస్సుల్లో ఈ విధానాన్ని ఆర్టీసీ యాజమాన్యం ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసింది. చిల్లర సమస్య, లావాదేవీలలో పారదర్శకత ఉంచేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ పేమెంట్స్ అమలు చేయడం వల్ల పేపర్, ప్రింటర్ వంటి వాటికీ అయ్యే ఖర్చు కూడా కాస్త తగ్గుతుందని ఆర్టీసీ భావించింది.

లేడీస్ కు స్మార్ట్ కార్డ్ ఇవ్వనున్నారు. ఆధార్ కార్డుతో ఈ కార్డును అనుసంధానం చేస్తారు.

Tags

Next Story