TG : టీచర్స్ డే రోజున చేనేత వస్త్రాలను వాడాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

TG : టీచర్స్ డే రోజున చేనేత వస్త్రాలను వాడాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

ఈ నెల 5న టీచర్స్ డే సందర్భంగా చేనేత వస్త్రాలు, శాలువాలను సన్మానానికి ఉపయోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో ఓ వీడియో రిలీజ్ చేశారు. చేనేత వస్త్రాలను ఉపయోగించినట్లయితే దీని వెనుక ఉన్న నేతన్నలందరికి ఆర్థికంగా సహకారం చేసినట్లు ఉంటుందని, ఈ క్రమంలోనే ప్రభుత్వం పక్షాన విద్యాశాఖ అధికారులను కోరారు. టీచర్స్ డే రోజు సింథటిక్ శాలువాల బదులు కాటన్ శాలువాలు వాడాలని సూచించారు. గణేష్ నవరాత్రుల్లోనూ కాటన్ వస్త్రాలను వాడాలన్నారు. సన్మాన కార్యక్రమంలోనూ కాటన్ టవల్స్ వాడాలని సూచించారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story