ఉత్తమ్​ సీఎం అయితడు .. నా నాలుక మీద మచ్చలున్నయ్​ : ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి

ఉత్తమ్​ సీఎం అయితడు .. నా నాలుక మీద మచ్చలున్నయ్​ : ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి
X

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అంటూ సంభోదించారు. అంతటితో ఆగకుండా ఉత్తమ్​ కుమార్​ రెడ్డి కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, తన నాలుకపై నల్లటి మచ్చలు కూడా ఉన్నాయని.. తాను ఏమి అంటే అది జరిగి తీరుతుందన్నారు. భువనగిరిలో పర్యటన సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. కాగా, శుక్రవారం భువనగిరి న్యూ డైమన్షన్ స్కూల్‌లో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్, వేముల వీరేశం, మందుల సామేలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం భువనగిరి మండలం అనాజీపురం శివారులోని బూనాది గాని కాల్వను మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు పరిశీలించారు. కాల్వ పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Tags

Next Story