Fraud : బోర్డు తిప్పేసిన వెలివిజన్ ఇన్ ఫ్రా.. రూ.14 కోట్లకు కుచ్చుటోపి

Fraud : బోర్డు తిప్పేసిన వెలివిజన్ ఇన్ ఫ్రా.. రూ.14 కోట్లకు కుచ్చుటోపి
X

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపిన వెల్ విజన్ ఇన్ ఫ్రా కంపెనీ రూ.14 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. వివరాల్లోకి వెళితే.. వెలివిజన్ ఇన్ ఫ్రా కంపెనీ.. పెట్టిన పెట్టుబడికి ప్రతి నెల ఫ్రిడ్జ్, టీవీలు బోనస్ ఇస్తామని కస్టమర్లను ఆకర్షించింది. రూ.లక్షకు టీవీ, రూ.2 లక్షలకు వాషింగ్ మిషన్, రూ.3 లక్షలకు ఫ్రిడ్జ్ బోనస్ ఇస్తామని చెప్పి నమ్మబలికింది. ఇలా కస్టమర్ల నుంచి ఏకంగా రూ.14 కోట్లు ముట్టిన తర్వాత బోర్డు తిప్పేసింది. ఈ నేపథ్యంలో మోస పోయామనిగ్రహించిన బాధితులు కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెలివిజన్ చైర్మన్ కందుల శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. పెట్టుబడుల పేరిట 3 స్కీమ్లతో భారీగా ఇన్వెస్టుమెంట్లు పెట్టించుకుని.. మొదటి స్కీంలో లక్షకు రెండు లక్షలు ఇస్తామంటూ నమ్మించి మోసానికి పాల్పడ్డారని పోలీసుల విచారణతో తేలింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Next Story