TG : లగచర్ల కేసులో తీర్పు రిజర్వ్

TG : లగచర్ల కేసులో తీర్పు రిజర్వ్
X

తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటన ఆధారంగానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారని హైకోర్టుకు ఏఏజీ రజనీకాంత్ తెలిపారు. దీంతో పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. లగచర్ల దాడి ఘటనలో ఆయనపై బోంరాస్ పేట పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ నరేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తీరుపై ఆయన భార్య అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

Tags

Next Story