ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు... టీఆర్ఎస్‌లో ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నేతవరకు అంతా బూతులే మాట్లాడుతున్నారని అన్నారు.. కేసీఆర్ పాలనలో దోపిడీ...కబ్జాలతో రాష్ట్రం నాశనం అయిందని అన్నారు.. తెలంగాణలో మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందన్న విజయశాంతి... అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు.. హైదరాబాద్ నాగోలులో జరుగుతున్న బీజేపీ మహిళా మోర్చా సమావేశంలో విజయశాంతి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయారని అందుకే...ఫాం హౌజ్.. ప్రగతి భవన్‌లో కూర్చుని పాలిస్తున్నాడని విమర్శించారు విజయశాంతి. కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు బయటకు వచ్చి ధైర్యం ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి కనీసం ఆ పని కూడా చేయలేదన్నారు.ప్రజలు మరో మూడేళ్ళ పాటు ఓపిక చేసుకుని కష్టపడితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకు రావచ్చని అన్నారు విజయశాంతి.. బీజేపీ మహిళలను ఎదుర్కొనే శక్తి లేకనే సోషల్ మీడియాలో కించపర్చేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు విజయశాంతి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com