Vijayashanti : కాంగ్రెస్ కు క్రెడిట్ వస్తుందని..మెట్రోపై కేంద్రం జాప్యం

Vijayashanti : కాంగ్రెస్ కు క్రెడిట్ వస్తుందని..మెట్రోపై కేంద్రం జాప్యం
X

కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందనే కారణం వల్లే కేంద్రం మెట్రో విస్తరణపై జాప్యం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆరోపించారు.హైదరాబాదులో మెట్రో రైలు రెండవ దశ విస్తరణ విషయంలో కేంద్రం నిర్లక్ష్యధోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన ప్రతీసారీ ప్రధాని మోడీగారితో పాటు కేంద్ర మంత్రుల్ని కలిసి రెండో దశ మెట్రో విషయంపై ఎన్నిసార్లు ప్రతిపాదన చేసినా..ఫలితం కనిపించడం లేదన్నారు. రాజకీయాలు పక్కనపెట్టి జీహెచ్ఎంసీలో ఎక్కువ సంఖ్యలో 42 మంది కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా బీజేపీ మెట్రో విస్తరణకు ఆమోదం దక్కేలా చొరవ చూపాలని సూచించారు. అప్పుడే తమను నమ్మి ఓటు వేసిన గ్రేటర్ ప్రజలకు న్యాయం చేసిన వారవుతారని చురకలంటించారు.

కేంద్ర మంత్రులను మెట్రో రెండో దశ ప్రతిపాదనపై ఒప్పించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీజేపీ ఎంపీలతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని విజయశాంతి డిమాండ్ చేశారు. అలా చేయడానికి బీజేపీ సిద్దపడితే వారితో కలిసి కేంద్ర మంత్రుల్ని కలిసి మెట్రో ప్రాజెక్ట్ అనుమతి పొందే ప్రయత్నానికి హైదరాబాద్ జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీగా నాతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇక ఈ విషయంలో నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత బీజేపీ పైనే ఉందనే విషయాన్ని ఆ పార్టీ గుర్తుంచుకోవాలన్నారు.

Tags

Next Story