Minister Ponguleti : వచ్చేనెల నుంచి గ్రామ పరిపాలనా అధికారులు : మంత్రి పొంగులేటి

రైతుల భూముల సర్వే కోసం 6 వేల మంది లైసెన్సుడ్ సర్వేయర్లను నియమించనున్నామని, ప్రతి గ్రామానికి ఒక గ్రామ పరిపాలన అధికారి చొప్పున 10, 695 మందిని వచ్చే నెల మొదటివారం నుంచి పంపించనున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రతి రైతుకు ఆధార్ లాగే భూధార్ కార్డును ఇచ్చి ఖాతా నెంబర్ ను ఇవ్వను న్నామని చెప్పారు. గతంలో భూములు అమ్మిన, కొన్న మ్యాపింగ్ లేదని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాప్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చట్టంలో తీ సుకురావడం జరిగిందన్నారు. భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలన్నింటినీ పరి ష్కరిస్తామని ప్రకటించారు.. ఇవాళ నల్గొండ జిల్లా చందంపేట మండలం, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. 'భూ సమస్యల పరిష్కారానికై రాష్ట్రంలోని 4 మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్నం. వచ్చే నెల 1 నుంచి గ్రామపరినపాలనాధికా రుల నియామక చర్యలు ప్రారంభమవుతాయి. జూన్ 2 నుంచి పైలెట్ మండలాల్లో వ్యవసాయ భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్క రిస్తం. భూభారతి పేదలు, బడుగు, బలహీన వర్గాలు, రైతులకు, భూములున్న ఆసాముల కోసం తీసుకొచ్చింది' అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com