ఎన్టీఆర్‌ భవన్‌లో వినాయక చవితి వేడుకలు..!

ఎన్టీఆర్‌ భవన్‌లో వినాయక చవితి వేడుకలు..!
హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ట్రస్ట్‌ భవన్‌లో జరిగిన వేడుకలకు చాలా ఏళ్ల తర్వాత చంద్రబాబు హాజరయ్యారు.. విఘ్ననాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. తెలుగు వారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు.

కులాల, మతాలకు అతీతంగా కొలిచే దైవం వినాయకుడని చంద్రబాబు అన్నారు. ఏ మంచి పనిచేయాలన్నా.. వినాయకుడి పూజ తర్వాతే మొదలుపెడతామన్నారు. హైదరాబాద్‌లో గణేష్‌ ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి ఒక్క మతాన్ని , మత విశ్వాసాన్ని గౌరవించాలన్నారు. ప్రభుత్వాలు సైతం అందకు అనుగుణంగా ప్రవర్తించాలని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇక చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు చంద్రబాబు రావడంతో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి.. ఎదురెళ్లి ఆయనకు స్వాగతం పలికారు టీడీపీ కార్యకర్తలు. ఆయన్ను కలిసేందుకు ఉత్సాహం చూపించారు.

Tags

Read MoreRead Less
Next Story