Nalgonda : హాస్టల్‌లో గొడ్డుకారంతో టిఫిన్.. వీడియో తీసి పోస్ట్ చేసిన అమ్మాయిలు

Nalgonda : హాస్టల్‌లో గొడ్డుకారంతో టిఫిన్.. వీడియో తీసి పోస్ట్ చేసిన అమ్మాయిలు
X

నల్గొండలోని మహాత్మగాంధీ హాస్టల్ విద్యార్థులకు గొడ్డుకారంతో పెట్టిన నాసిరకం భోజనం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విశ్వవిద్యాలయం విద్యార్థులకు టిఫిన్ లో గొడ్డుకారం పెట్టిన అంశం హాటాపిక్ అయ్యింది. యూనివర్సిటీలోని కృష్ణవేణి హాస్టల్లో ఉదయం విద్యార్థులకు గొడ్డుకారంతో టిఫిన్ పెట్టారు. దీనికి సంబంధించి వీడియోలను విద్యార్థినులు తీసి.. వారి ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఆ వీడియోలు వైరల్ గా మారడంతో యూనివర్సిటీ హాస్టల్ యాజమాన్యం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గతంలోనూ హాస్టల్ సిబ్బంది ఇలానే వ్యవహరించడంతో విద్యార్థినులు యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఈరోజు ఉదయం విద్యార్థినులు గొడవకు దిగారు.

Tags

Next Story