Rangareddy District : మహేశ్వరం హనుమాన్ ఆలయం వద్ద విశ్వహిందూ పరిషత్ ఆందోళన

Rangareddy District : మహేశ్వరం హనుమాన్ ఆలయం వద్ద విశ్వహిందూ పరిషత్ ఆందోళన
X

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి శ్రీ వీర హనుమాన్ దేవాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దేవాలయం సమీపంలోని ఓ దర్గాకు మేకపోతును బలి ఇచ్చారు కొందరు వ్యక్తులు.

హనుమాన్ దేవాలయం సమీపంలోని దర్గాకు మేకను బలివ్వడాని వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆందోళనకు దిగారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో మేకను బలి ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. మేకను బలి ఇచ్చిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు వదిలేది లేదని విశ్వహిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు.

Tags

Next Story