Jubilee Hills :జూబ్లీహిల్స్ లో ఓటు చోరీ.. కాంగ్రెస్ వాయిస్ పెంచాల్సిందే..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు ఓటు చోరీ అంశం పెద్ద ఇష్యూ అయిపోయింది. బీఆర్ ఎస్ పార్టీ దీన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకుని ప్రచారం చేయడానికి రెడీ అవుతోంది. దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత నామినేషన్ వేసేశారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ ఎస్ ప్రచార బాధ్యతలు మొత్తం కేటీఆర్ తన భుజాన వేసుకున్నారు. కేటీఆర్ ఓటుచోరీ అంశాన్ని హైలెట్ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడికే మూడు ఓట్లు ఉన్నాయంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలు పెద్ద సంచలనం రేపుతున్నాయి. గత ఎన్నికల్లో 3లక్షల 73 వేల ఓట్లు ఉండగా.. రెండేళ్లకే 3లక్షల 98 వేల ఓట్లకు ఎలా పెరిగాయి అంటూ లేవనెత్తిన ప్రశ్నలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
ఈ ఓటు చోరీ విషయంలో కాంగ్రెస్ పెద్దలు సరిగ్గా స్పందించట్లేదు. కేవలం చోటా మోటా లీడర్లు టీవీల డిబేట్లకు వచ్చి ఏవేవో చెబుతున్నారు. పైగా ఎలక్షన్ కమిషన్ విచారణ పేరుతో చేసిన హడావిడి కూడా పెద్దగా జనాల్లోకి వెళ్లట్లేదు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ కు మైనస్ గా మారిపోయింది. ఒకే ఇంట్లో 43 ఓట్లు ఉండటం అంటే.. బహుళ అంతస్తు బిల్డింగ్ కాబట్టి.. అక్కడ గతంలో రెంట్ కు ఉన్న వాళ్లు అదే అడ్రస్ మీద తీసుకున్నారేమో అన్నట్టు అధికారుల నుంచి మాట వినిపిస్తోంది. కానీ జనాలు అధికారుల మాటలను పెద్దగా వినరు. అదే ప్రభుత్వం చెబితేనే కరెక్ట్ గా అర్థం చేసుకుంటారు. అసలే బీహార్ లో ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు చేసిన ఆరోపణలు దేశంలోనే ఓ సంచలనం.
అలాంటప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తమ హయాంలో అసలు ఓటు చోరీ అనేది లేదు అని బలంగా నిరూపించుకోవాల్సిందే. లేదంటే మాత్రం ఇందులో నిజం ఉన్నా లేకపోయినా.. ఆ మరకలు అంటుకోవడం ఖాయం. కాబట్టి ఈ ఆరోపణలను బలంగా తిప్పి కొట్టాలి. అవసరం అయితే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి దీనిపై స్పందించాలి. కఠినమైన యాక్షన్ తీసుకుంటున్నామని ప్రజలను నమ్మించాలి. తమకు ఓటు చోరీ చేయాల్సిన అవసరం లేదని బలంగా ప్రజలకు వివరించాలి. బీఆర్ ఎస్ ను మించి ఈ విషయంలో కాంగ్రెస్ వివరణ ఉండాలి. అప్పుడే ఈ అంశం హైలెట్ కాకుండా ఇతర అంశాలపై ఎన్నికలు జరుగుతాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com