Komatireddy Raj Gopal Reddy : కోమటిరెడ్డిని కాంట్రాక్టర్‌తో పోల్చిన మంత్రి తలసాని.. తెలంగాణ అసెంబ్లీలో రగడ
Komatireddy Raj Gopal Reddy : తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్,టీఆర్ఎస్ సభ్యుల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంట్రాక్టర్‌తో పోల్చడంతో వివాదం చెలరేగింది. దీనిపై రాజగోపాల్ ఫైర్ అయ్యారు.
తనను కాంట్రాక్టర్ అంటే బాధేమి లేదన్న ఆయన.. పేకాడేవాళ్లు మంత్రులుకాగా లేందీ కాంట్రాక్టర్ ఎమ్మెల్యే కావొద్దా అధ్యక్షా అనడంతో... సభలో ఒక్కసారిగా అలజడి నెలకొంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బలహీనవర్గానికి చెందిన మంత్రిపై రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడటం భావ్యం కాదని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఆ మాటలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇక తెలంగాణ వచ్చి 8ఏళ్లు అయినా గ్రామాలు అభివృద్దికి నోచుకోలేదన్నారు రాజగోపాల్ రెడ్డి. రోడ్లు, మురుగునీటి కాలువలు, పంచాయితీ భవనాలు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. పల్లెప్రగతిలో భాగంగా వీటిని కూడా అభివృద్దిచేస్తే బాగుంటుందన్నారు.
చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల కొందరు సర్పంచ్‌లు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎన్నికలు జరిగి ఇన్నిరోజులైనా ఇప్పటి వరకు గ్రామాలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహక నిధులు విడుదల చేయలేదని రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com