Telangana News : తెలంగాణలో తిట్ల పురాణం.. హద్దులు దాటుతున్న భాష.

Telangana News : తెలంగాణలో తిట్ల పురాణం.. హద్దులు దాటుతున్న భాష.
X

తెలంగాణ రాజకీయాల్లో తిట్ల పురాణం మరీ ఎక్కువ అయిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకులు పోటీపడి మరీ తిట్లు తిట్టేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి ఒక మాట అన్నారు. ఇప్పటివరకు ఒక లెక్క ఇక్కడి నుంచి మరో లెక్క తోలు తీస్తాం అంటూ మాట్లాడారు. ఇంకేముంది ఆ మాటతో కాంగ్రెస్ ఫైర్ అయింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అవుతూ లాగులు తొండలు చొప్పిస్తాం అంటూ పెద్ద మాట అనేశారు. అంతకుమించి మరో రెండు మాటలు కూడా అనడంతో రచ్చ మరింత పెరిగింది. వాస్తవానికి కేసీఆర్ అయినా లేదంటే రేవంత్ రెడ్డి అయిన సీఎం కుర్చీలో కూర్చున్నవారే. కాబట్టి వాళ్ళిద్దరూ కంట్రోల్ తప్పడం అంటే మామూలు విషయం కాదు. ఒకచోట లీడర్ లేదా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడితే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదేమో. కానీ ఒక సీఎం స్థాయిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడటం పై తెలంగాణలో కొత్త రచ్చ స్టార్ట్ అయింది.

రేవంత్ మాటలకు కేటీఆర్ రియాక్ట్ అవుతూ మరింత రెచ్చిపోయాడు. ఏకంగా ఎడమకాలు చెప్పు తీసుకుని కొడతా అంటూ మాట్లాడటంతో ఈ రచ్చ డబుల్ అయింది. మొన్నటి వరకు కాస్త అటు ఇటుగా మాట్లాడిన వారందరూ కూడా ఇప్పటినుంచి రెచ్చిపోయి వ్యక్తిగత గౌరవం కూడా తగ్గించేసుకుంటున్నారు. కేటీఆర్ మాటలతో పాటు హరీష్ రావు కూడా ఇలాంటి మాటలు మాట్లాడటంతో కాంగ్రెస్ సీరియస్ అయింది. ఇంకేముంది రెండు పార్టీల నడుమ ఇలా బూతులు మాటలు మరింత పెరిగిపోతున్నాయి. ఇది తెలంగాణ రాజకీయాల్లో అస్సలు మంచిది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయాలు అంటే చాలా హుందాగా కనిపించాలి. ప్రజల సమస్యల మీద మాత్రమే మాట్లాడాలి. అంతేగాని ఇలా కించపరుస్తూ బూతులు మాట్లాడటం, వ్యక్తిగత నిందలు అనేవి మంచివి కావు.

ఇలాంటి వాటివల్ల ప్రజల సమస్యలు పక్కకు పోయి ఇవే హైలెట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఏ పార్టీ నేతలు ఆ పార్టీ అగ్ర లీడర్లు మాట్లాడిన దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పదేపదే కేసిఆర్ చనిపోవాలి అని మాట్లాడటం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చింది అని బిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇంకోవైపు సీఎం అనే విషయాన్ని కూడా పక్కన పెట్టేసి ఇలా బాడీ షేమింగ్ చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి అలా మాట్లాడాడు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇలా ఎవరికి వారే వాళ్లను సపోర్ట్ చేసుకుంటున్నారు తప్ప రాజకీయాల్లో హుందాగా బిహేవ్ చేయాలి అనే విషయాన్ని ఎవరూ మాట్లాడకపోవడం ఇక్కడ విచారకరం. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే ఎన్నికల సమయంలో ఇంకెలా ఉంటారు అనేది ఇక్కడ వస్తున్న ప్రశ్నలు. కెసిఆర్, రేవంత్, కేటీఆర్ లాంటివారు ఇలాంటి తిట్ల పురాణాన్ని వదిలిపెడితే బాగుంటుందని చెబుతున్నారు ఆ పార్టీల కిందిస్థాయి కార్యకర్తలు.


Tags

Next Story