Global Recognition : వరంగల్ మిర్చికి ప్రపంచ గుర్తింపు..!

తెలంగాణ రాష్ట్రానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. వరం గల్ జిల్లాలో ప్రత్యేకంగా పండిం చే చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించిం ది. ఈ మేరకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ ఈ విష యాన్ని ప్రకటించింది. దీంతో ఈ మిర్చికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. చపాటా మిర్చి జీయో ట్యాగ్ పొందడంతో రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తుల సంఖ్య 18కి చేరింది. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పండే ఈ మిర్చికి ప్రత్యేకమైన రుచి, ఘాటు ఉంటుంది. వరంగల్ చపాటా చిల్లీకి జీఐ ట్యాగ్ రావడం వల్ల ఈ మిర్చిని ప్రపంచవ్యాప్తంగా విక్రయించడానికి వీలవుతుంది.
చపాటా మిర్చి కి జీఐ ట్యాగ్ కోసం తిమ్మంపేట మిర్చి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ మూడేళ్ల క్రితం ధరఖాస్తు చేసింది. వరంగల్ జిల్లాలోని గీసుకొండ, సంగెం, ఖిలా వరంగల్, వరంగల్ మండలాల్లోని దాదాపు 10 వేల ఎకరాల్లో, జమ్మికుంట మండలం నాగారం గ్రామాల్లో 80 ఏళ్లుగా వరంగల్ చపాటా మిర్చిపంటను సాగు చేస్తున్నారు. ఈ మిర్చిని పండించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నేల, వాతా వరణం అను కూలంగా ఉండటంతో ఇక్కడి మిర్చి ప్రత్యేకమైన రుచిని సంతరిం చుకుంటోంది. ఈ మిర్చి కాసింత కారంత క్కువతోపాటు గాఢమైన ఎరుపు రంగును కలిగి ఉండడంతోపాటు లావుగా ఉండడంతో చపాటా మిర్చిగా పేరు వచ్చింది. కాగా చాపాటా మిర్చికి జియో ట్యాగింగ్ లభించడంపై ఉమ్మడి వరంగల్ జిల్లా మిర్చి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com