KTR : హైకమాండకు తెల్వకుండానే రెడ్ కార్పెట్ పరిచారా? : కేటీఆర్

అదానీ విషయంలో కాంగ్రెస్ ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడుతుం దని, హైకమాండ్కు తెల్వకుండానే ఆయనకు రాష్ట్రంలో రెడ్ కార్పెట్ పరిచారా? మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటుకు రేవంత్ సహ కరిస్తున్నారని ఆరోపించారు. అదానీతో దేశానికి నష్టమైతే.. తెలంగాణకు నష్టం కాదా? రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్చేశారు. కెన్యా లాంటి చిన్న దేశాలే ఒప్పందాలే రద్దు చేసుకున్నప్పుడు.. రేవంత్ రెడ్డి ఎందుకు రద్దు చేసుకోడు? అని ప్ర శ్నించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘జాతీయపార్టీకి ఢిల్లీలో ఒక నీతి.. గల్లీలో మరొక నీతి. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే.. కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్ పార్టీనా? అదానీ అవి నీతిపరుడైతే.. రేవంత్ రెడ్డి నీతిపరుడు ఎలా అవుతాడు? రాహుల్ గాంధీ చెప్పాలి. మా హయాంలో ఎంత ప్రయత్నం చేసినా.. తె లంగాణలో అదానీకి అవకాశం ఇవ్వలేదు. రేవంత్లూ. 12,400 కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. స్కిల్ యూనివర్సిటీకి ఆయన రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు. రాహుల్గాంధీకి చిత్తశు ద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలి. అదానీ వ్యవహా రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని మరోసారి రుజువైంది. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. అదానీతో ఒప్పందాలపై పున రాలోచన చేయాలన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సూచన రేవంత్ రెడ్డి తీసుకోవాలి' అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com