నీటి వాటాలపై బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్..

నీటి వాటాలపై బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్..
X

తెలంగాణలో మళ్లీ నీటివాటాలపై రగడ మొదలైంది. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని.. నిధులు కూడా కేటాయించిందని మాజీ సీఎం కేసీఆర్ మొన్న ఆరోపించారు. సీఎం రేవంత్ సర్కార్ చంద్రబాబుకు అనుకూలంగా ఉందని కావాలనే దాన్ని అడ్డగించలేదని దీని మీద పోరాడుతామని అంటున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఆ ప్రాజెక్టు మీద సుప్రీంకోర్టుకు వెళ్లామని జనవరి 5న విచారణ ఉందని తెలిపారు. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. కృష్ణా జలాల్లో 66, 34 శాతం ఫైల్ మీద కేసీఆర్ స్వయంగా సంతకాలు చేశారని చెబుతున్నారు. అప్పుడు సంతకాలు చేసి ఇప్పుడు ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారని మండిపతున్నారు రేవంత్ రెడ్డి.

అయితే బీఆర్ ఎస్ కు మైలేజ్ కావాల్సినప్పుడల్లా చంద్రబాబు పేరు తీసుకువస్తారని.. లేదంటే ఏపీ మీద ఏదో ఒక ఆరోపణ చేస్తారని అంటున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఏపీలో జాబు కావాలంటే బాబు రావాలనే సామెత ఉంటే.. ఇక్కడ తెలంగాణలో బీఆర్ ఎస్ కు మైలేజ్ కావాలంటే చంద్రబాబు పేరు ఉండాల్సిందే అన్నట్టు వాళ్ల రాజకీయాలు ఉన్నాయంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మీద గట్టిగానే పోరాడుతోందని.. త్వరలోనే దానిపై మరింత బలంగా వాదనలు వినిపిస్తామని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అప్పుడు కేసీఆర్ సంతకాలు చేసి ఇప్పుడు పోరాడుతా అనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

బీఆర్ ఎస్ మాత్రం రేవంత్ రెడ్డి కావాలనే చంద్రబాబుకు అనుకూలంగా ఉంటున్నారని ఆరోపిస్తోంది. త్వరలోనే ఈ అంశం మీద మాజీ సీఎం కేసీఆర్ మూడు భారీ బహిరంగ సభలు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఆ సభల ద్వారా కేసీఆర్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దీంతో తెలంగాణలో మరింత ఘాటుగా రాజకీయాలు మారబోతున్నాయని అర్థం అవుతోంది. ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ చంద్రబాబు పేరు చుట్టూ వివాదాలు సృష్టించడం ఏంటని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి మీద రాజకీయాలు ఉండాలి గానీ ఎంతసేపు చంద్రబాబు నాయుడి పేరు తీసుకువస్తే ఏమొస్తుందని అంటున్నారు టీడీపీ కార్యకర్తలు.

Tags

Next Story