KTR : రేవంత్ కోసం కలిసికట్టుగానే పని చేస్తున్నారు : కేటీఆర్

KTR : రేవంత్ కోసం కలిసికట్టుగానే పని చేస్తున్నారు : కేటీఆర్
X

సీఎం రేవంత్రెడ్డి కోసం కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ మాత్రం తగ్గకుండా తెలంగాణ బీజేపీ నాయకులు కాంగ్రెస్ లో కలిసిమెలిసి పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీతో రాష్ట్ర బీజేపీ నాయకుల భేటీపై కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. సీఎం చోటేభాయ్వంత్రెడ్డి కోసం తెలంగాణ బీజేపీ నాయకులంతా కలిసికట్టుగానే పనిచే స్తున్నారని ఏద్దేవా చేశారు. 'చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం.. 'చేయి' కలుపుతూ.. చోటే భాయ్ కోసం కలిసి పని చేస్తున్నారు. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరు మెదపరు! రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటున్నారు. హైడ్రా మంచిదంటా రు, మూసీ కావాలంటారు.. ఏమన్నా అంటే నిద్ర నటిస్తారు! పిల్లలు చనిపోయినా.. రైతు గుండె పగిలినా, గిరిజనులను చెరపట్టినా, చప్పట్లు కొడతారు. ఇప్పుడు తెలంగాణలో వారి చేతిలోనే కమలం ఉంది. జాగ్రత్తగా.. భద్రంగా' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Tags

Next Story