Congress Leader Jagga Reddy: ఇంటింటికి వెళ్లి కులగణన సర్వే చేశాం : జగ్గారెడ్డి

ఇంటింటికి అధికారులు వెళ్లి కులగణన సర్వే చేశారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడు తూ..కులగణన పై రాష్ట్ర బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని విమర్శిం చారు. క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే చేసారని తెలిపారు. కిషన్ రెడ్డికి ఈ విషయం తెలియదేమో తెలుసుకోవాలని అన్నారు. కులగణ నపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేసి సక్సెస్ అయ్యాడు. అందుకే డైవర్ట్ చేసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 100 శాతం సర్వే విజయవంతంగా జరిగిందని.. గవర్నర్ కూడా ఆమోదముద్ర వేశారని గుర్తు చేశారు. దానికి అర్థం సర్వే సరిగా జరిగింది అనే కదా..? అని అడిగారు. సర్వే కమిటి జరిగిన నెల రోజులు కిషన్ రెడ్డి రాష్ట్రంలో లేరేమో అని వ్యాఖ్యానిం చారు. కులగణనపై పూర్తిస్థాయిలో కిషన్ రెడ్డికి అవగాహన లేదన్నా రు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని.. వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారన్నారు. బీజేపీ ఎమ్మెల్యేల మీద కూడా కిషన్ రెడ్డికి అనుమానం ఉందా..? అని ప్రశ్నించారు. సర్వేలో పాల్గొనని వారి కోసం మళ్ళీ సమయం పొడిగించారు అని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి మాటలు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కిషన్ రెడ్డికి సెంట్రల్ పార్టీ మొట్టికాయలు వేసిందని.. అందుకే ఈ మధ్య మాటలు మాట్లా డుతున్నాడని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయం తీసుకునే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. రాజకీయ విమర్శలు మానుకోవాలని కిషన్ రెడ్డికి జగ్గారెడ్డి సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com