Ponnam Prabhakar : మూసీ వరదలపై బురద రాజకీయాలను మానుకోవాలి : మంత్రి పొన్నం

X
By - Manikanta |29 Sept 2025 2:30 PM IST
మూసీ వరదపై BRS బురద రాజకీయం మానుకోవాలని హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించిన మంత్రి పొన్నం......MLA బత్తుల లక్ష్మారెడ్డి, MLC శంకర్ నాయక్ తో కలిసి స్థానిక RTC బస్టాండ్ ను తనిఖీ చేశారు. అనంతరం MLA క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన పొన్నం.....మూసీ వరదపై KTR వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శమన్నారు. ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించిన తర్వాతే నీటిని దిగువకు విడుదలు చేసినట్లు వివరించారు. ఆపత్కాలంలో ప్రజలను ఆందోళనకు గురి చేయడం సరికాదని తెలిపారు. 42 శాతం BC రిజర్వేషన్లపై కొందరు కేసులు వేసినప్పటికీ......కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com