Hydra Commissioner : బాధితులకు న్యాయం చేస్తం..హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటన

Hydra Commissioner : బాధితులకు న్యాయం చేస్తం..హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటన
X

బాధితులు ఫిర్యాదు చేసినా కేసులు ఎందుకు నమోదు చేయలేదని హయత్ నగర్ పోలీసులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 951, 952లో ప్లాట్స్ ఓనర్స్, ఆ భూమి కొనుగోలు చేసిన సంరెడ్డి బాల్ రెడ్డి అనే వ్యక్తి మధ్య కొన్నిరోజులుగా వివాదం కొనసాగుతోంది. ఈక్రమంలో ఈనెల 1న ప్లాట్స్ ఓనర్స్ పై బాల్ రెడ్డి ఆయన అనుచరులు కొడ్డలి, కత్తులతో దాడికి దిగారు. దీంతో హయత్ నగర్ పోలీసులు ఇరువర్గాలపై సాధారణ కేసు నమోదు చేశారు. మరోవైపు ఇక్కడ వెంచర్ కు సంబంధించిన రోడ్డును కబ్జా చేసి ఫాంహౌజ్ నిర్మిస్తున్నారని ఫిర్యాదు అందడంతో హైడ్రా దానిని కూల్చేసింది. అయితే ఫాంహౌజ్ ఓనర్ బాల్ రెడ్డి హైకోర్ట్ నుంచి నాట్ టు ఇంటర్ఫియర్ తో పాటు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. తాజాగా ఇవాళ కోహెడలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటించారు. గొడవ జరిగిన సమయంలో కత్తులు, గొడ్డలి యూజ్ చేసిన కూడా బాల్ రెడ్డిపై హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలతోనే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాధితులకు న్యాయం చేసే విధంగా హైడ్రా పనిచేస్తుందని భరోసా ఇచ్చారు.

Tags

Next Story