Hyderabad City Police : తప్పుడు పోస్టులను సహించం ..హైదరాబాద్ సిటీ పోలీస్ వార్నింగ్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీస్ వార్నింగ్ ఇచ్చింది. ‘అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు.. కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం మా దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. ఈ విషయంలో పోలీసులను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా పరిగ ణిస్తం. ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవిం చిన ఈ కేసులో ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతున్నం.దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదు. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే మాకు అందించవచ్చు. కానీ, సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని తరపున విజ్ఞప్తి చేస్తు న్నాం. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్ర చారాలను నమ్మవద్దని ప్రజలను కోరుతున్నం' అని సిటీ పోలీసు శాఖ ట్వీట్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com