Bandi Sanjay : ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం: బండి సంజయ్

Bandi Sanjay : ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం: బండి సంజయ్
X

ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులిస్తామన్నారు. అలాగే కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమని, తామే ముద్రించి ప్రజలకు కార్డులు జారీ చేస్తామని స్పష్టంచేశారు. కాగా రాష్ట్రానికి 20లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ కోరారు.

ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ సహా బీఆర్ఎస్ నేతలపై పెట్టిన కేసులన్నీ ఏమయ్యాయని అన్నారు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు సహా పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరిన సందర్భంగా సంజయ్ మాట్లాడారు. దావోస్ పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

Tags

Next Story