KTR: తెలంగాణలో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: మంత్రి కేటీఆర్

KTR: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను...కేంద్రంలో బీజేపీ సర్కార్ దేశవ్యాప్ంగా అమలుచేస్తోందన్నారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా...ఈనెల 25న టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లు మంత్రి కేటీఆర్ పరిశీలించారు.
పార్కింగ్, సభాస్థలి ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతినిధులు, నాయకులకు కేటాయించిన మార్గాలు అధికారులు కేటీఆర్‌కు వివరించారు. సీఎం వచ్చే మార్గం, ట్రాఫిక్ రద్దీ తదితర అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు కేటీఆర్‌కు తెలిపారు.
అటు అక్టోబర్ 17న టీఆర్‌ఎస్ అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్ విడుదల కానున్నది. అక్టోబర్ 17 నుంచి 22 వరకు నామినేషన్ల స్వీకరణతోపాటు ఈనెల 23న నామినేషన్ల పరిశీలన ఉంటుందని. అక్టోబర్ 24న నామినేషన్ల ఉపసంహరణ, అక్టోబర్ 25న టీఆర్‌ఎస్ అధ్యక్షుడి ఎన్నికతో పాటు సర్వసభ్య సమావేశం, ప్లీనరీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ప్లీనరీకి రాష్ట్ర వ్యాప్తంగా 14వేల మంది ప్రతినిధులను ఆహ్వానిస్తామని టీఆర్‌ఎస్ వర్గాల తెలిపాయి..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com